Filmfare Awards 2026: డెబ్యూ విన్నర్స్‌ను స్టేజిపై మాట్లాడనివ్వరా.. నిహారిక సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-23 06:58:33  IST  )

బెస్ట్ డెబ్యూ అవార్డులు అందుకున్న వారికి స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం నన్ను చాలా బాధించింది.

Filmfare Awards 2026: డెబ్యూ విన్నర్స్‌ను స్టేజిపై మాట్లాడనివ్వరా.. నిహారిక సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన 2026 ఫిల్మ్‌ఫేర్ అవార్డు(Filmfare Awards)ల వేడుక ముగిసినా, దానిపై చర్చలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela )ఈ ఈవెంట్ నిర్వహణపై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఫిల్మ్‌ఫేర్ విఫలమైందంటూ ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. నిహారిక తన పోస్ట్‌లో రాస్తూ.. ‘‘అద్భుతమైన ప్రతిభను గుర్తించడం ఎప్పుడూ స్పెషలే. కానీ తెలుగు, తమిళ, కన్నడ రంగాల నుంచి బెస్ట్ డెబ్యూ (తొలి చిత్రం) అవార్డులు అందుకున్న వారికి స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం నన్ను చాలా బాధించింది. ఈ స్టేజ్ వారికి కేవలం ఒక అవార్డు తీసుకునే చోటు మాత్రమే కాదు, అది వారి కల నెరవేరిన క్షణం. సమయ పరిమితులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ మొదటిసారి వేదికపై నిలబడ్డ వారికి కనీసం ఒక నిమిషం టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

ఆ నిమిషమే వారికి లైఫ్ టైమ్ మెమరీగా మిగిలిపోయేది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు అర్గనైజర్స్‌ను తప్పుపట్టడం గమనార్హం. ఇకనిహారిక నటిగా కంటే నిర్మాతగా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్న ఆమె, చాలామంది కొత్త నటులను వెండితెరకు పరిచయం చేశారు. బహుశా అందుకే కొత్త వారి భావోద్వేగాలను ఆమె అంతలా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా.. నిహారిక సినిమాల విషయానికొస్తే.. తన రెండో ప్రాజెక్ట్ ‘రాకాస’ పనుల్లో బిజీగా ఉన్నారు. సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాఫ్టా-2026 అవార్డుల్లో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' క్లీన్ స్వీప్.. ఏకంగా 6 అవార్డులు కైవసం!

హిస్టరీ క్రియేట్ చేసిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు

Next Story