- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్మన్‌ఘాట్‌లో రేపు జగన్నాథ స్వామి రథోత్సవం
భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా నిలిచే శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఈ నెల 21వ తేదీ (మంగళవారం) శ్రీ కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానంలో వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.లావణ్య తెలిపారు.

దిశ, చంపాపేట్ : భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా నిలిచే శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని ఈ నెల 21వ తేదీ (మంగళవారం) శ్రీ కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానంలో వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.లావణ్య తెలిపారు. త్రిదండి శ్రీ భక్తి సౌరభ్ మహారాజ్ వారి పవిత్ర ఆశీస్సులతో నిర్వహించనున్న ఈ మహోత్సవానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు భక్తుల భజన కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమవుతాయి.
అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఆలయ ప్రాంగణం నుంచి భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఘనంగా సాగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించనుండగా, అనంతరం విచ్చేసిన భక్తులకు మహాప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. రథోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఆలయ పరిసరాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం నిర్వాహకులు పిలుపునిచ్చారు.






