- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిస్టరీ క్రియేట్ చేసిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
తక్కువ కాలంలోనే అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటిగా ఆమె రికార్డులకెక్కింది.

దిశ, సినిమా: భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగా ఆమె ఒక అద్భుతమైన చరిత్రను సృష్టించింది. తక్కువ కాలంలోనే అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటిగా ఆమె రికార్డులకెక్కింది. ‘అమరన్’ (Amaran)చిత్రానికి గాను ఉత్తమ నటి (తమిళం) అవార్డును అందుకోవడంతో ఆమె ఖాతాలో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేరాయి. కేవలం 10 ఏళ్ల సినీ ప్రయాణంలో, అది కూడా కేవలం 20 సినిమాలు కూడా పూర్తి చేయకుండానే సాయి పల్లవి ఈ స్థాయికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రేమమ్ (మలయాళం): ‘మలర్’ టీచర్‌గా తన తొలి సినిమాతోనే ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’ అవార్డు దక్కించుకుంది. ఫిదా (తెలుగు): ‘భానుమతి’ పాత్రలో తెలంగాణ భాషతో మెప్పించి ‘ఉత్తమ నటి’గా తొలి తెలుగు ఫిల్మ్‌ఫేర్. శ్యామ్ సింగ రాయ్ (తెలుగు): దేవదాసి పాత్రలో ఆమె పండించిన భావోద్వేగాలకు ‘ఉత్తమ నటి’ అవార్డు వచ్చింది. అలాగే నాగచైతన్యతో చేసిన లవ్ స్టోరీ (తెలుగు): సినిమాకు కూడా ‘ఉత్తమ నటి’ పురస్కారం లభించింది.
ఇక విరాటపర్వం (తెలుగు): వెన్నెల పాత్రలో ఆమె అద్భుత నటనకు ‘ఉత్తమ నటి (క్రిటిక్స్)’ అవార్డు రాబట్టింది. గార్గి (తమిళం): తండ్రి కోసం పోరాడే కూతురిగా ఆమె నటనకు ‘ఉత్తమ నటి’ (తమిళం) అవార్డు. అమరన్ (తమిళం): ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో ‘ఇందు రెబెకా వర్గీస్’ పాత్రకు గాను తాజాగా 7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. మూడు వేర్వేరు భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం) ఉత్తమ నటిగా అవార్డులు గెలవడమే కాకుండా, కెరీర్ మొదలుపెట్టిన పదేళ్లలోనే ఏడు ‘బ్లాక్ లేడీ’ విగ్రహాలను ఇంటికి తీసుకెళ్లడం సాయి పల్లవికే సాధ్యమైంది. కన్నడలో ఇప్పటివరకు సినిమాలు చేయని ఆమె, భవిష్యత్తులో అక్కడ కూడా సినిమా చేసి అవార్డు గెలిస్తే మరోలా ఉండేది. ప్రస్తుతం సాయి పల్లవి తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరగనుంది. ఇదే జోరు కొనసాగితే, భవిష్యత్తులో ఆమె నేషనల్ అవార్డ్స్‌తో పాటు మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.






