బాఫ్టా-2026 అవార్డుల్లో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' క్లీన్ స్వీప్.. ఏకంగా 6 అవార్డులు కైవసం!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-23 06:46:12  IST  )

"బాఫ్టా 2026: 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' క్లీన్ స్వీప్! ర్యాన్ కూగ్లర్ 'సిన్నర్స్' సరికొత్త రికార్డు. ఉత్తమ నటుడిగా రాబర్ట్ అరామయో సంచలనం."

బాఫ్టా-2026 అవార్డుల్లో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ క్లీన్ స్వీప్.. ఏకంగా 6 అవార్డులు కైవసం!
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం రాత్రి బాఫ్టా (BAFTA) ఫిల్మ్ అవార్డ్స్ - 2026 వేడుకలు లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌ (Royal Festival Hall)లో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్‌లో అద్భుతమైన డ్రామా, చరిత్ర, సంచలనాలు నమోదయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్ థామస్ ఆండర్సన్ రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' (One Battle After Another) ఆరు అవార్డులను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సీన్ పెన్ (ఉత్తమ సహాయ నటుడు) విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను గెలుచుకుంది.

మరోవైపు, ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన 'సిన్నర్స్' (Sinners) బాఫ్టా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఒక నల్లజాతీయుడైన దర్శకుడి చిత్రం మూడు బాఫ్టా అవార్డులను గెలుచుకోవడం ఇదే తొలిసారి. వూన్మి మొసాకు ఉత్తమ సహాయ నటిగా నిలవగా, ర్యాన్ కూగ్లర్ 'ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే' విభాగంలో అవార్డు గెలిచిన మొదటి నల్లజాతీయుడిగా చరిత్రకెక్కారు. ఈ చిత్రం ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలోనూ విజేతగా నిలిచింది.

ఈ వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన చిత్రం 'ఐ స్వైర్' (I Swear). ఈ చిత్రంలోని నటనకు గాను రాబర్ట్ అరామయో అత్యంత పోటీ ఉన్న 'ఉత్తమ నటుడు' (Best Actor) అవార్డుతో పాటు 'రైజింగ్ స్టార్' అవార్డును కూడా గెలుచుకుని సంచలనం సృష్టించారు. టూరెట్ సిండ్రోమ్‌పై అవగాహన కల్పించే ఈ డ్రామెడీ చిత్రం, ప్రజాభిప్రాయం ద్వారా ఒక అవార్డును, రెండు పరిశ్రమ వర్గాల ఓటింగ్‌తో మొత్తం మూడు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. అలాగే 'హామ్నెట్' (Hamnet) చిత్రం 'అత్యుత్తమ బ్రిటిష్ చిత్రం'గా అవార్డు పొందింది.

Filmfare Awards 2026: డెబ్యూ విన్నర్స్‌ను స్టేజిపై మాట్లాడనివ్వరా.. నిహారిక సెన్సేషనల్ పోస్ట్

Next Story