- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ చరిత్రలోనే అత్యంత ‘యువ వ్యతిరేక’ ప్రధాని మోడీ: రాహుల్ గాంధీ ఫైర్
కేంద్ర ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలోనే యువతను ఇంతలా చిన్నచూపు చూసిన ప్రధాని మరొకరు లేరని, మోడీ అత్యంత ‘యువ వ్యతిరేక’ ప్రధాని అని మండిపడ్డారు. పార్లమెంటు ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఉద్దేశించి ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తొలిసారి స్పందించారు.
మంత్రి రాజీనామా అడగలేరు..
పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారని, అయినా ఆయనతో రాజీనామా చేయించే సాహసం ప్రధాని చేయలేకపోతున్నారని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఏకంగా 152 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, దీని వల్ల సుమారు 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులుగా మారారని ఆయన ఆరోపించారు. విద్యా వ్యవస్థపై, పరీక్షలపై తమకు జరుగుతున్న అన్యాయం గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగేందుకు వచ్చిన విద్యార్థులపై లాఠీలు ఝుళిపించడం, అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.
పేపర్ లీక్ చేసిన అసలు నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను మాత్రం రోడ్లపై ఈడ్చుకెళ్లి కొట్టారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం యువతను విఫలం చేయడమే కాకుండా, వారిపై దారుణంగా దాడులకు తెగబడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






