అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా పదుకొణె ఔట్.. మరో హీరోయిన్‌ను తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చిన టీమ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-23 08:33:56  IST  )

దీపికా గర్భవతి కావడంతో యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం కష్టమని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని, మేకర్స్ వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా పదుకొణె ఔట్.. మరో హీరోయిన్‌ను తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా బన్నీకి జోడీగా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటిస్తుండటంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపికా పదుకొణె తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడంతో, ‘రాకా’ సినిమా నుంచి ఆమె తప్పుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె గర్భవతి కావడంతో యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం కష్టమని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని, మేకర్స్ వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు సినిమాలో ఆమె పాత్ర నిడివిని కూడా తగ్గించబోతున్నారనే పుకార్లు ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేశాయి. ఈ పుకార్లపై ‘రాకా’ చిత్ర బృందం తాజాగా స్పందించింది. ఇవన్నీ కేవలం అబద్ధపు వార్తలే అని తేల్చి చెప్పింది.

దీపికా పదుకొణె ఈ సినిమా నుంచి తప్పుకోలేదని, ఆమెనే హీరోయిన్‌గా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వేరే ఎవరినీ తీసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ ఎక్కడా ఆగలేదని, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ప్రకారమే పక్కాగా సాగుతోందని వెల్లడించారు. సినిమాలో దీపికా పాత్ర చాలా కీలకమని, ఆమె పాత్రను తగ్గించారనే వార్తల్లో అస్సలు నిజం లేదని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో దీపికా కొన్ని క్రేజీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించనుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి దృష్ట్యా, వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సీక్వెన్స్‌లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా, అల్లు అర్జున్ - అట్లీ - దీపికా పదుకొణెల క్రేజీ కాంబో చెక్కుచెదరకుండా ఉందని తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అల్లు అర్జున్-లోకేష్ ‘AA-23’పాన్ ఇండియా కాదు.. అంతకు మించి! స్టోరీ లీక్ చేసిన రైటర్!

చిరంజీవి సినిమాలో విల‌న్ గా హాట్ బ్యూటీ ?

Next Story