- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్-లోకేష్ ‘AA-23’పాన్ ఇండియా కాదు.. అంతకు మించి! స్టోరీ లీక్ చేసిన రైటర్!
ఇది ఒక పక్కా పాన్-ఇండియన్ మూవీ. కేవలం స్టార్ హీరో ఉన్నాడనో, లేక లొకేషన్ల వల్లో కాదు.. ఈ కథకు ఉన్న అంతర్జాతీయ ఆకర్షణ వల్ల ఇది గ్లోబల్ లెవల్‌లో మెప్పిస్తుంది.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లైనప్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా స్టార్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న బన్నీ, ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్న AA23పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా రైటర్ రత్నకుమార్ పంచుకున్న విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా గురించి రత్నకుమార్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక భాషకో లేదా ఒక ప్రాంతానికో పరిమితం అయ్యే సినిమా కాదని స్పష్టం చేశారు. "ఇది ఒక పక్కా పాన్-ఇండియన్ మూవీ. కేవలం స్టార్ హీరో ఉన్నాడనో, లేక లొకేషన్ల వల్లో కాదు.. ఈ కథకు ఉన్న అంతర్జాతీయ ఆకర్షణ వల్ల ఇది గ్లోబల్ లెవల్‌లో మెప్పిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. బన్నీ ఇమేజ్‌కు తగ్గట్టుగా లోకేష్ కనగరాజ్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
ఇప్పటికే మూడు వారాల పాటు ఈ ప్రాజెక్ట్ చర్చల కోసం టీమ్ అంతా కలిసి కూర్చున్నారని, అల్లు అర్జున్‌తో మాట్లాడటం చాలా ఉత్సాహంగా అనిపించిందని ఆయన తెలిపారు. మే రెండో వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో వేగవంతం కానున్నాయని అన్నారు. పనులన్నీ ఒక రేంజ్‌లో సాగుతున్నాయని, బన్నీ ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని హింట్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ ఈ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లో జాయిన్ కాబోతున్నారు. లోకేష్ సినిమా అంటేనే ఉండే ఆ సినిమాటిక్ యూనివర్స్ టచ్ ఈ సినిమాకు కూడా ఉంటుందా? లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.






