చిరంజీవి సినిమాలో విల‌న్ గా హాట్ బ్యూటీ ?

by velandi.Saikiran |   (  Updated:2026-04-23 03:28:17  IST  )

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన డింపుల్ హయాతి, పెద్ద ప్రాజెక్టులలో నెగిటివ్ రోల్స్ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారట.

చిరంజీవి సినిమాలో విల‌న్ గా హాట్ బ్యూటీ ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో డింపుల్ హయాతి ఒకరు. విజయవాడలో పుట్టిన ఈ అందాల తార, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. 2017 లో గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డింపుల్ హయాతి, గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేశారు. ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రామబాణం, భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి సినిమాలు చేసి అందరినీ అలరించారు డింపుల్ హయాతి. అయితే ఇక పైన నెగిటివ్ రోల్స్ చేసేందుకు ఈ అందాల తార సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

నెగిటివ్ రోల్స్ లో డింపుల్

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన డింపుల్ హయాతి, ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకున్నట్లు టాక్ నడుస్తోంది. పెద్ద ప్రాజెక్టులలో నెగిటివ్ రోల్స్ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారట. కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో డింపుల్ హయాతి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే డింపుల్, చిత్ర బృందం మధ్య సంప్రదింపులు కూడా పూర్తయ్యాయట. గతంలో గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో మొదటగా డింపుల్ హయాతిని నెగిటివ్ రోల్ కోసం తీసుకుని, ఆ తర్వాత వద్దనుకున్నారట. కానీ ఇప్పుడు మాత్రం ఆమె నెగిటివ్ రోల్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్ నడుస్తోంది.

జాక్వెలిన్ కు జైలు నుంచి ప్రేమలేఖ.. వైరల్

Next Story