జాక్వెలిన్ కు జైలు నుంచి ప్రేమలేఖ.. వైరల్

by Muthe.Rajitha |

నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఆమె ప్రియుడు సుఖేష్ చంద్రశేఖరన్ జైలు నుంచి రాసిన ప్రేమ లేఖ వైరల్ అవుతోంది.

జాక్వెలిన్ కు జైలు నుంచి ప్రేమలేఖ.. వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్, మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఉద్దేశించి రాసిన ప్రేమలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖలో సుఖేష్ అత్యంత భావోద్వేగంతో స్పందిస్తూ, "ప్రేమ మరియు యుద్ధంలో ఏం చేసినా సరియైనదే (All is fair in love and war).. నువ్వు నా దానివి, నేను ఎప్పుడూ నీవాడినే, ఏది ఏమైనా నేను నీకు అండగా ఉంటాను" అంటూ తన ప్రేమను ప్రకటించాడు. జాక్వెలిన్‌ను "మై బేబీ", "బొమ్మ" వంటి ముద్దుపేర్లతో పిలుస్తూ, ఆమె పట్ల తనకున్న పిచ్చి ప్రేమను (Love you crazy) ఈ లేఖ ద్వారా సుఖేష్ వ్యక్తపరిచాడు. గతంలో కూడా క్రిస్మస్, వాలెంటైన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయన ఇలాంటి లేఖలు రాసినప్పటికీ, తాజా లేఖ మాత్రం కేసు కీలక మలుపు తిరుగుతున్న సమయంలో రావడం గమనార్హం.

ఈ లేఖ వెనుక ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2000 కోట్ల భారీ మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేష్‌కు వ్యతిరేకంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కోర్టులో అప్రూవర్ గా మారాలని దరఖాస్తు చేసుకున్న తరుణంలో ఈ స్పందన వచ్చింది. ఈ కేసులో తాను కూడా బాధితురాలినేనని, సుఖేష్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని జాక్వెలిన్ మొదటి నుంచీ వాదిస్తూ వస్తోంది. అయితే సుఖేష్ మాత్రం నిరంతరం ఆమెకు లేఖలు రాస్తూ తన సన్నిహిత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లేఖపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ఒక విఫల ప్రేమికుడి ఆవేదనగా అభివర్ణిస్తుంటే, మరికొందరు జైలులో ఉండి కూడా ఒక నటిని ఇలా మానసికంగా వేధించడం ఆందోళనకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story