చిరంజీవి-అల్లు అర్జున్ మధ్య వివాదం.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-22 05:26:19  IST  )

అల్లు అర్జున్ తన మామ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ద్వారానే ఇండస్ట్రీకి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.

చిరంజీవి-అల్లు అర్జున్ మధ్య వివాదం.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: అల్లు అర్జున్ తన మామ చిరంజీవి ద్వారానే ఇండస్ట్రీకి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. మెగా, అల్లు కుటుంబాలు ఏ ఫంక్షన్ జరిగినా వారు చేసే సందడి అంతా ఇంత కాదు. మెగా కుటుంబంలో ఏదైనా వేడుక ఉందంటే అల్లు ఫ్యామిలీ అంతా కచ్చితంగా హాజరవుతారు. అలాగే మెగా ఫ్యామిలీ సైతం అంతే. సినిమా ఈవెంట్లకు సైతం కలిసి వెళ్లిన రోజులున్నాయి. అలాంటి కుటుంబాలు గత ఎన్నికల వల్ల దూరంగా ఉంటున్నట్లు ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అల్లు అర్జున్ తన మామ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు మద్దతు ఇవ్వకుండా తన స్నేహితుడు వైఎస్ఆర్ సిపి నేత శిల్పా రవి రెడ్డి కోసం ప్రచారం చేయడంతో అసలు కథ మొదలైంది. ఈ సంఘటన విభేధాలకు దారితీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధరమ్ తేజ్, ఐకాన్ స్టార్‌ను అన్ ఫాలో చేయడంతో అంతా వివాదం వార్తలు నిజమే అన్ని నమ్మారు. ఇక అప్పటినుంచి ఇరు కుటుంబాలు దూరంగా ఉంటున్నాయి. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌‌కు అల్లు అర్జున్ హాజరు కావడం లేదు.

ఈనేపథ్యంలో.. ఓ ఈవెంట్‌లో భాగంగా మా కుటుంబాల మధ్య ఎలాంటి వివాదం లేదని అల్లు అర్జున్ చెప్పినప్పటికీ వార్తలకు చెక్ పడలేదు. నిత్యం ఏదో ఇక వార్త నెట్టింట వైరల్ అవుతుండటంతో పాటు మెగా-అల్లు హీరోలకు సంబంధించిన అభిమానులు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ‘హరిహరివీరమల్లు’ చిత్రాన్ని సైతం అల్లు అరవింద్ అడ్డుకునేందుకు ప్రయత్నించారనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్స్ మూసి వేస్తామని ప్రకటించడంతో మెగా అభిమానులు షాక్‌కు గురయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నలుగురు కలిసి పవన్‌పై ఉన్న కోపంతో ఇలా చేస్తున్నారని పలు పుకార్లు వచ్చాయి.

ఈక్రమంలోనే అల్లు అరవింద్ స్పందించారు. ఇప్పుడు ప్రతి చోట ఆ నలుగురు ఆ నలుగురు అంటున్నారు. నేను ఆ నలుగురిలో లేను. ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశా. తెలంగాణాలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు... 'ఏఏఏ' (అమీర్‌పేట్‌లోని అల్లు అర్జున్ ఏషియన్ మల్టీప్లెక్స్) తప్ప! రెండు తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే... నాకు పదిహేను కూడా లేవు. త్వరలో ఆ థియేటర్స్ కూడా నా దగ్గర ఉండవు అన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం వివాదం సర్దుమనిగినప్పటికీ మెగా, అల్లు కుటుంబాలు దూరంగా ఉంటున్నట్లు నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ రెండు కుటుంబాలు ఒకరి ఇంట్లో ఫంక్షన్‌కు మరొకరు వెళ్లడం లేదు.

Read More..

రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ట్వీట్ కోసమే ఎదురుచూస్తున్నాయి.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్

సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు.. సీఎంకు థ్యాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్.. రాజకీయాల్లో ‘లిటిల్‌’ స్టార్

Next Story