రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ట్వీట్ కోసమే ఎదురుచూస్తున్నాయి.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-22 05:25:26  IST  )

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున తెలుగు రాష్ట్రాల పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఆయనను సినిమాకు సినానిమ్‌గా పరిగణిస్తూ అభిమానులు, ప్రముఖులు బర్త్ డే సందర్భంగా విష్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు,

రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ట్వీట్ కోసమే ఎదురుచూస్తున్నాయి.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున తెలుగు రాష్ట్రాల పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఆయనను సినిమాకు సినానిమ్‌గా పరిగణిస్తూ అభిమానులు, ప్రముఖులు బర్త్ డే సందర్భంగా విష్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ప్రముఖ నటులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని.. సినిమా శిఖరాగ్రంగా వెలుగొందాలని కోరుకుంటున్నారు. కానీ అందరి చూపు అల్లు అర్జున్ ఎలాంటి ట్వీట్ చేస్తాడనే విషయంపైనే ఫోకస్ అయింది. అసలు విష్ చేస్తాడా లేదా అనే డౌట్ కూడా ఉంది.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదిరిపోయే పోస్టు పెట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘హ్యాపీ బర్త్ డే మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయనతో స్టెప్స్ వేస్తున్న హ్యాపీ మూమెంట్‌ను పంచుకున్నాడు. దీంతో లైక్స్ ఫటా ఫట్ పడుతుండగా.. కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. అల్లు, మెగా ఫ్యామిలీ బాండింగ్ ఇలాగే ఉండాలని కొందరు కోరుకుంటుంటే.. బన్నీ అన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ట్వీట్ కోసమే ఎదురుచూస్తున్నాయని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

TWEET

Read More..

చిరంజీవి-అల్లు అర్జున్ మధ్య వివాదం.. అసలేం జరిగిందంటే?

Next Story