- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చూడటం కాదు సార్.. తాళం తీయించండి’.. డీఎంకే కౌంటరిచ్చిన 8వ తరగతి విద్యార్థి!
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిర్వహించిన ‘తహసీల్ దివస్’లో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి అధికారులను తన మాటలతో విస్మయానికి గురి చేశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిర్వహించిన ‘తహసీల్ దివస్’లో ఓ ఎనిమిదో తరగతి (13 ఏళ్లు) విద్యార్థి అధికారులను తన మాటలతో విస్మయానికి గురి చేశాడు. తన బంధువులు తమ ఇంటికి తాళం వేసి ఆక్రమించుకున్నారని, ఇతరుల ఇళ్లలో పని చేస్తూ తన తల్లి కుటుంబాన్ని పోషిస్తోందని ఆ బాలుడు నేరుగా జిల్లా మేజిస్ట్రేట్ (DM)కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన డీఎం.. ‘ఈ సమస్యను చూడండి’ అని పోలీసులను ఆదేశించారు. బాలుడు వెంటనే జోక్యం చేసుకుంటూ.. ‘సార్, ఊరికే చూడమని కాదు, వెళ్లి తాళం తీయమని గట్టిగా చెప్పండి. వీళ్లు ఊరికే టోపీలు పెట్టుకుని వస్తుంటారు.. కాస్త కమిషన్ ముడితే గానీ ఇక్కడ పని జరగదా?’ అని ఏమాత్రం భయం లేకుండా ప్రశ్నించాడు. అంత చిన్న వయసులోనే అతడి ధైర్యం చూసి డీఎం సహా అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బాలుడి చురుకుదనాన్ని మెచ్చుకున్న డీఎం.. వెంటనే ఆ ఇంటి తాళం తీయించి, సమస్యను పరిష్కరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






