బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఆ హీరోయిన్‌తో మరోసారి నాగచైతన్య సినిమా!

by Disha Web Desk 9 |
బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఆ హీరోయిన్‌తో మరోసారి నాగచైతన్య సినిమా!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సెన్సిబుల్ స్టోరీలతో ఢిపరెంట్ సినిమాలను రూపొందించడం దర్శకుడు ‘శేఖర్ కమ్ముల’ స్టైల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత లవ్‌స్టోరీ మూవీనే జనాల్ని బాగా ఆకట్టుకుంది. అయితే చైతన్య, మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని తెలిసిందే. ఇక త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందట. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చైతన్య జాలరి పాత్రలో నటించనున్న ఈ చిత్రంలో చై సరసన సాయిపల్లవి నటించబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆ హీరోయిన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. వీరి కాంబోలో సినిమా అంటే నెటిజన్లకు ఇక పండగే.

Read More..

ఎయిర్ పోర్ట్‌లో శృతి హాసన్‌కు వేధింపులు.. వెంటపడ్డ ఆగంతకుడు (వీడియో)

తమ్ముడ్ని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకొన్న హీరోయిన్


Next Story