ఎయిర్ పోర్ట్‌లో శృతి హాసన్‌కు వేధింపులు.. వెంటపడ్డ ఆగంతకుడు (వీడియో)

by Disha Web Desk 6 |
ఎయిర్ పోర్ట్‌లో శృతి హాసన్‌కు వేధింపులు.. వెంటపడ్డ ఆగంతకుడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య చిత్రాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే ఫామ్‌లో దూసుకుపోతూ వరుస ఆఫర్స్‌ను కొట్టేస్తుంది.

తాజాగా, శృతి హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శృతి హాసన్ని ముంబై ఎయిర్ పోర్ట్లో గుర్తు తెలియని వ్యక్తి వెంటపడ్డాడు. తన కార్ పార్కింగ్ ఏరియా వరకు వెంబడించిన ఆ వ్యక్తి వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న ఈ వ్యక్తి ఎవరనేది తెలియకపోయినప్పటికీ అతని ప్రవర్తన నచ్చకపోవటం వల్ల శృతి భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే శృతి హాసన్ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అంతేకాకుండా శృతి హాసన్ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ఆ వ్యక్తి ట్రై చేస్తుండగా..నువ్వెవరో నాకు తెలియదు అంటూ శృతి గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు సెల్ఫీ తీసుకోవాలి కానీ ఇలా వెంబడించి బెదిరించడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

తమ్ముడ్ని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకొన్న హీరోయిన్

Next Story