తమ్ముడ్ని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకొన్న హీరోయిన్

by Anjali |
తమ్ముడ్ని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకొన్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ‘7/G బృందావన్’ కాలనీ చిత్రం 20 ఏళ్ల క్రితం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. రవికృష్ణ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. అయితే ఇందులో కథానాయికగా నటించి అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన సోనియా అగర్వాల్ గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సోనియా ఈ చిత్ర డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందు ఈ దర్శకుడి తమ్ముడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను ప్రేమించిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక వీరిద్దరు హీరో హీరోయిన్స్‌గా చేసిన ‘కాదల్ కొండేన్’ అనే సినిమాకి దర్శకుడిగా సెల్వ రాఘవన్ చేశారు. ఈ సినిమా టైంలోనే ధనుష్‌కు, సోనియాకు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ ఇద్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట.

Read More..

కేంద్ర కేబినెట్ భేటీకి కొన్ని గంటల ముందు సినీ నటి ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్



Next Story