ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్‌కు నిఖత్ జరీన్

by Harish |
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్‌కు నిఖత్ జరీన్
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లో జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో వరల్డ్ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ జోరు కొనసాగుతోంది. మహిళల 52 కేజీల కేటగిరీలో ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ బౌట్‌లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన టోమిరిస్ మిర్జాకుల్‌ను మట్టికరిపించింది. ప్రత్యర్థిపై నిఖత్ పంచ్‌ల వర్షం కురిపించి బౌట్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. అలాగే, మీనాక్షి(48 కేజీలు), అనామిక(50 కేజీలు), మనీషా(60 కేజీలు) గోల్డ్ మెడల్ బౌట్‌కు అర్హత సాధించారు. సెమీస్ మ్యాచ్‌ల్లో మీనాక్షి 5-0 తేడాతో గుల్నాజ్ బురిబయేవా(కజకిస్తాన్)పై నెగ్గగా.. మనీషా అంతే తేడా కజకిస్తాన్‌కే చెందిన తంగతర్ అస్సెం‌ను ఓడించింది. మరో బౌట్‌లో గుల్నార్ తురప్బాయ్(కజకిస్తాన్)ను డిస్‌క్వాలిఫై చేయడంతో అనామిక విజేతగా నిలిచింది. మరోవైపు, సోను(63 కేజీలు), మంజు బంబోరియా(66 కేజీలు) సెమీస్ బౌట్లలో ఓడి కాంస్యంతో సరిపెట్టారు. శనివారం ఫైనల్స్ జరగనున్నాయి.

Next Story

Most Viewed