సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్

by Hajipasha |
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఈ పదవికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు జరిగింది. ఇందులో అత్యధికంగా 1,066 ఓట్లను సాధించి కపిల్ సిబల్ విజయం సాధించారు. దీంతో నాలుగో సారి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కపిల్ సిబల్‌కు దక్కింది. గతంలో 1995-96, 1997-98, 2001లో మూడుసార్లు ఈ పదవీ బాధ్యతలను సిబల్ నిర్వర్తించారు. ఇక ఈ ఎన్నికలో రెండో స్థానంలో సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్ నిలిచారు. ఆయనకు 689 ఓట్లు వచ్చాయి. ఇంతకుముందు వరకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అదిశ్ సి.అగర్వాలాకు 296 ఓట్లే వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీచేసిన ప్రియా హింగోరాణి, త్రిపురారి రాయ్, నీరజ్ శ్రీవాస్తవలకు నామమాత్రంగా ఓట్లు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed