శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం.. ప్రయాణికుడికి నో ఎంట్రీ !

by Batti.Sumithra |

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్‌ కలకలం రేగింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం.. ప్రయాణికుడికి నో ఎంట్రీ !
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్‌ కలకలం రేగింది. గతంలో ఎబోలా వ్యాధి చరిత్ర ఉన్న సుడాన్ దేశానికి చెందిన ఓ ప్రయాణికుడిని అధికారులు గుర్తించారు. విమానాశ్రయంలో నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ స్క్రీనింగ్ సమయంలో సదరు ప్రయాణికుడి వైద్య వివరాలను పరిశీలించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడిని భారతదేశంలోకి అనుమతించకుండా తిరిగి వెనక్కి పంపారు.

ఈ ఘటన పై వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తూ, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన ఎలాంటి ప్రమాద పరిస్థితి ప్రస్తుతం లేదని, అన్ని జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హెల్త్ స్క్రీనింగ్ ప్రక్రియను మరింత పటిష్ఠంగా కొనసాగిస్తున్నామని, అనుమానాస్పద కేసులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖల మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

Next Story