తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 15 వరకు సెలవులు పొడిగింపు!

by Prasad Jukanti |   (  Updated:2026-06-04 09:18:22  IST  )

తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 15 వరకు సెలవులు పొడిగింపు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా పలు విద్యాసంస్థలు వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి. భానుడి భగభగల కారణంగా రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగించగా తాజాగా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల వేసవి సెలవుల పొడిగింపుపై (Anganwadi Holidays) ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం అంగన్‍వాడీ సెంటర్లకు మే 1 నుంచి జూన్‌‌‌‌‌‌‌‌ 1 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకే ఇల్లు వదిలి బయటకు రావాలంటే జంకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను అంగన్‍వాడీ సెంటర్లకు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో వేసవి సెలవులను ఈ నెల 10 లేదా 15వ తేదీ వరకు పొడిగించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story