Krishna Vamshi: కెరీర్‌లో ఆ రెండు చిత్రాలపై అసంతృప్తి ఉంది

by Pulgam srinivas |

‘రాఖీ’, ‘సముద్రం’ చిత్రాల్లో తన పనిపై పూర్తిగా సంతృప్తి చెందలేదని కృష్ణవంశీ తెలిపారు.

Krishna Vamshi: కెరీర్‌లో ఆ రెండు చిత్రాలపై అసంతృప్తి ఉంది
X

దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆఖరుగా ఆయన రూపొందించిన చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. తాజాగా కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తనకు ఇష్టమైన సినిమా ఏది? అలాగే తాను అసంతృప్తి చెందిన చిత్రాలు ఏవి? అనే విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన చిత్రం ‘సింధూరం’ అని, ఆ సినిమాలో తన పని అద్భుతంగా అనిపించిందని ఆయన తెలిపారు. అదే సమయంలో తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లో తన పనిపట్ల పూర్తిగా సంతృప్తి చెందని రెండు సినిమాలు ‘రాఖీ’ మరియు ‘సముద్రం’ అని చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటనపై కూడా ఆయన స్పందిస్తూ, ఎన్టీఆర్ చాలా కష్టపడే వ్యక్తి, ఎంతో హార్డ్‌వర్కర్ అని కృష్ణవంశీ పేర్కొన్నారు.

Next Story