- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తారా ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు మూడవ దశ కౌన్సిలింగ్ జరుగుతోందని, ఇదే చివరి అవకాశమని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ తెలిపారు.

దిశ,సంగారెడ్డి అర్బన్: తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు మూడవ దశ కౌన్సిలింగ్ జరుగుతోందని, ఇదే చివరి అవకాశమని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ తెలిపారు. దోస్త్ రెండవ దశలో సీట్లు పొందిన విద్యార్థులు తమ సీటును ఖరారు చేసుకోవడానికి మీసేవ లేదా ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా రేపటిలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని, లేనిపక్షంలో వారి సీటు రద్దవుతుందని హెచ్చరించారు. మూడవ దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 15వ తేదీతో ముగియనుందని, డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు తారా కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణలోని టాప్-పది కళాశాలల్లో ఒకటిగా, జాతీయ స్థాయి ఎన్‌ఏఏసీ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన తారా కళాశాలలో బీ.ఏ, బీ.ఎస్సీ లైఫ్ & ఫిజికల్ సైన్సెస్, బీసీఏ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్ కోర్సులతో పాటు ఉపాధి ఆధారిత బీ.కాం (బీఎఫ్‌ఎస్‌ఐ), బీ.కాం (హెచ్‌ఆర్), బీబీఏ (రిటైలింగ్), బీ.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, జిమ్, అతిపెద్ద లైబ్రరీ సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడల ద్వారా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లతో పాటు, పదవ తరగతి, ఇంటర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అమ్మాయిలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఏడాదికి రూ. 30,000, మలబార్ గోల్డ్ సంస్థ ఏడాదికి రూ,.10,000 స్కాలర్‌షిప్ అందిస్తోందని తెలిపారు.అడ్మిషన్లపై సందేహాలున్న అభ్యర్థులు నేరుగా కళాశాలను సందర్శించి నివృత్తి చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.






