- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 7న ఎంఎంసీ భవనానికి సీఎం శంకుస్థాపన
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7న భూమి పూజ చేయనున్నారు.

X
దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7న భూమి పూజ చేయనున్నారు. ఎంఎంసీ భవనంతో పాటు వివిధ కుల సంఘాల భవనాలు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేస్తారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఓ ప్రకటన లో తెలిపారు. జూన్ 7 న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉప్పల్ బగాయత్ లో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం వజ్రేష్ యాదవ్ ఉప్పల్ బాగాయత్ స్థలాన్ని పరిశీలిస్తారు. ఉప్పల్ బగాయత్ లో ప్రభుత్వం ఎంఎంసీ ప్రధాన కార్యాలయానికి 10 ఎకరాల స్థలంతో పాటు, రూ.100 కోట్ల నిధులను కేటాయించింది.
Next Story






