గంగపాలెం గజ.. గజ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-04 08:09:49  IST  )

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం కొండపై పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది...

గంగపాలెం గజ.. గజ
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా(Polavaram District) దేవీపట్నం మండలం గంగంపాలెం కొండ(Gangampalem Konda)పై పెద్దపులి(Tiger) సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత బుధవారం నుంచి పులి ఈ కొండ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు(Forest Department officials) గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియోకాలర్ సిగ్నల్స్ ఆధారంగా, అలాగే డ్రోన్ల సాయంతో దాని కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

రహదారుల మూసివేత

పులి సంచారం కారణంగా మైదాన ప్రాంతాల నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయానికి రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వన్యప్రాణిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

హైఅలర్ట్

ఈ నేపథ్యంలో గంగంపాలెం చుట్టుపక్కల ఉన్న గిరిజన, మైదాన ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పులిని పట్టుకునే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

Next Story