- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్ హత్యకేసు.. ఎమ్మెల్సీ అనంతబాబుకు మళ్లీ ఎదురుదెబ్బ
by Naga Rani Yarlagadda |
డ్రైవర్ హత్యకేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబుకు పిటిషన్ ను రాజమండ్రి ఏసీబీ కోర్టు మళ్లీ షాకిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో హత్యకేసులో అరెస్టైన ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. అనంతబాబు తరపున లాయర్ వేసిన బెయిల్ పిటిషన్ ను రాజమండ్రి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అనంతబాబుకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారయ్యే ఛాన్సుందని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఉన్న సాక్ష్యుల్ని చంపుతానని అనంతబాబు బెదిరించారని వివరించారు. అలాగే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పీపీ వాదనతో ఏకీభవించిన జడ్జి.. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.
Next Story






