- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రివ్యూ.. బాక్సాఫీసు వద్ద మెగా విధ్వంసం!
పెద్ది పాత్రలో చరణ్ వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. రెండు, మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించగా.. జూన్ 4న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఇందులో పెద్ది పాత్రలో చరణ్ వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. రెండు, మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ముఖ్యంగా కుస్తీ వీరుడిగా కనిపించేందుకు ఆయన బాడీని మార్చుకున్న తీరు, పడిన కష్టం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. స్క్రీన్‌పై ఆయన్ని చూసిన వారంతా వావ్ సూపర్ అంటున్నారు.
ఇక జాన్వీ విషయానికొస్తే.. గ్లామర్‌తో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌ను తెచ్చింది. ముఖ్యంగా ‘చికిరి’ పాటలో ఆమె అందం, అదిరిపోయే స్టెప్పులు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. జగపతి బాబు ‘అప్పలసూరి’ పాత్రలో మరోసారి తన విలక్షణ నటనను చూపించగా, గౌర్‌నాయుడు పాత్ర అద్భుతంగా ఉంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తనదైన హుందాతనంతో మెప్పించారు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఎంచుకున్న నేటివిటీ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్టాఫ్‌లో క్రికెట్ హంగామాతో కథ సరదాగా సాగిపోగా.. సెకండాఫ్‌లోకి వచ్చేసరికి ఎమోషనల్ కుస్తీ పోరాటంగా మారి సినిమా పీక్స్‌కు వెళ్తుంది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.
కథ విషయానికొస్తే.. విజయనగరం జిల్లాలోని కొండ కింద గ్రామం చుట్టూ తిరిగే కథ. ఇక అక్కడ వందల మంది జీవిస్తున్నా.. ప్రభుత్వ రికార్డుల్లో ఈ ఊరికి చోటుండదు. దాంతో అక్కడి ప్రజలను అందరూ చిన్నచూపు చూస్తుంటారు. అదే ఊరిలో పుట్టి, రోజూ టౌన్‌కు వెళ్లి కూలి పనులు చేసుకునే యువకుడే పెద్దిగా రామ్ చరణ్ కనిపించారు. పేరుకి కూలి అయినా, క్రికెట్‌లో మాత్రం అతనొక రాటు దేలిన ఆటగాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగల అతని టాలెంట్ చూసి బొబ్బిలి, విజయనగరం జట్లు వేలంలో పోటీ పడుతుంటాయి. అలాంటి అద్భుతమైన క్రికెటర్, అసలు ఆ ఆటను వదిలేసి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? తన కొండ కింద గ్రామం ఉనికి కోసం, అక్కడి మనుషుల ఆత్మగౌరవం కోసం పెద్ది ఎలాంటి పోరాటం చేశాడు? ఈ ప్రయాణంలో అతను ఏం కోల్పోయాడు, ఏం సాధించాడు? అప్పలసూరి, గౌర్‌నాయుడు పాత్రలు పెద్ది జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అచ్చియమ్మ పాత్ర వల్ల అతని లైఫ్‌లో వచ్చిన మలుపులు ఏంటి? అనేదే ‘పెద్ది’ సినిమా కథ. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను రాబట్టుకుంటూ.. భారీ కలెక్షన్లతో బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతోంది.






