కేంద్ర కేబినెట్ భేటీకి కొన్ని గంటల ముందు సినీ నటి ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

by Nagaya |
కేంద్ర కేబినెట్ భేటీకి కొన్ని గంటల ముందు సినీ నటి ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో దేశవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బిల్లు లోక్ సభలో పాస్ కావడం ఒకటే మిగిలి ఉంది. నరేంద్రమోడీ ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున్న బిల్లు సజావుగానే పాస్ కానుంది. కాగా, కేబినెట్ ఆమోదంపై రాజకీయ నేతల నుంచి ట్వీట్స్ మోగుతున్నారు. అయితే కేబినెట్ భేటీకి ముందే సినీనటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

వినాయక చవితి సందర్భంగా పూజల్లో పాల్గొన్న ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లుపై ట్వీట్ చేసింది. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే ఏళ్ల తరబడి పెరుగుతున్న నేరాల రేటు తగ్గుతుంది - రాజకీయ దురాశకు, కీర్తికి అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయంగా ఉపయోగపడేలా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఈ గణేష్ చతుర్థిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బిల్లుపై చర్చించడానికి కేబినెట్ భేటీకి కొద్ది గంటల ముందే పూనమ్ ట్వీట్ చేయడం.. ఆ తర్వాత అదే బిల్లును మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed