- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిఖం భూములు ఖతం..!
మనిషి పశు జీవ నాధరమైన నీటి వనరులు కబ్జా కూరల్లో చిక్కుకుంటున్నాయి.

దిశ, కొణిజర్ల : మనిషి పశు జీవ నాధరమైన నీటి వనరులు కబ్జా కూరల్లో చిక్కుకుంటున్నాయి. మానవుడి వ్యక్తిగత స్వార్థం మునుడను ప్రశ్నార్ధకం చేస్తుంది. మనిషి జీవన యానంలో కీలకమైన ప్రకృతి సహజ వనరులను దరాశతో కొందరు నాశనం చేస్తుండటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది. పదుల ఎకరాల స్వంత సాగు భూములు ఉన్నప్పటికీ శిఖం భూములతో పాటు చెరువులను (ఎఫ్ టీఎల్)ను సైతం కబళిస్తున్నారు. డబ్బు అధికారం మాటున అక్రమాలకు బరితెగిస్తుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుంది. నెలనెలా లక్షల రూపాయలు వేతనం తీసుకుంటూ బాధ్యతగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమి సంబధం లేనట్లు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరు పట్ల ఆయకట్టు రైతుల్లో తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం అవుతుంది. చెరువుల దురాక్రమణ తీరు తెన్నులను పరిశీలిస్తే.... కొణిజర్ల మండలం చిన్న గోపతి రాళ్ళ చెరువు పెద్ద గోపతి పామ్ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి...
రాళ్ల చెరువు సర్వే నెంబర్ 184లో 84.05 ఎకరాల విస్థీర్ణం ఉంది. దీని పరిధిలో 102 ఎకరాల ఆయకట్టు సాగు చేస్తున్నారు. పెద్ద గోపతి పామ్ చెరువు సర్వే నెంబర్ 38లో 128.12 ఎకరాల విస్థీర్ణం ఉంది. దీని పరిధిలో 119 ఎకరాల సాగు భూమి ఉంది. చెరువు ఆయకట్ట పరిధిలో ఉన్న కొందరు రైతులు శిఖం భూమితో పాటు నీరు నిల్వ ఉండే చెరువు ప్రాంతం (ఎఫ్ టీఎల్)ను సైతం కబళిస్తున్నారు. పెద్ద గోపతి పాం చెరువు ఖమ్మం నగరంలో నివాసముంటున్న అనంతారం గ్రామానికి చెందిన ఓ బడా రైతు తనకున్న భూమి సరిపోదన్నట్టు శిఖం భూమితో పాటు చెరువును కబళించాడు. సుమారు పది అడుగు లోతు చెరువును పూడ్చి సాగు చేసుకుంటున్నాడు. సుమారు ఐదెకరాలకు పైగా ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణ ప్రాంతంలో ఇటీవల చెపల చెరువు నిర్మించే ప్రయత్నం చేస్తుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు అడ్డుకున్నారు. చిన్నగోపతి రాళ్ల చెరువును కొంతమంది రైతులు ఆక్రమించుకున్నారు. చెరువు నీటి నిలువ ప్రాంతాన్ని పూడ్చి చదును చేసి తమ భూముల్లో కలుపుకుని సేద్యం చేసుకుంటున్నారు. గత కొన్నినేళ్లుగా ఈ అక్రమ వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత శాఖ అధికారులకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకునే స్థితిలో ఇరిగేషన్ శాఖ అధికారులు లేకపోవడం విశేషం.ఆక్రమణల పరంపర ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చెరువులు కనిపించకపోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలు అడుకోవాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీఈ వివరణ..
చెరువుల ఆక్రమణ వైపు స్థానిక డీఈ గౌతమి శిల్పాను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. ఏఈఈ నాగేందర్రావును వివరణ కోరగా డీఈ ఫోన్లో స్పందించక పోవడంతో ఇంచార్జీ ఏఈఈ నాగేందర్రావును కోరగా కొద్ది రోజుల్లో డిజిటల్ సర్వే వస్తుందని ఆక్రమణలు అన్ని తొలగించబడతాయి అన్నారు.
చెరువులన్ని సర్వే చేసి హద్దు బందులు ఏర్పాటు చేయాలి..
ఆమ్ అద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు స్వర్ణ సుబ్బారావు..
మండలంలో చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణలను తొలగించి ఆక్రమణదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోతే ఆక్రమణల పరంపర యధావిధిగా కొనసాగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి వెంటనే అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.






