- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జట్టుకు బిగ్ రిలీఫ్..ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు!
భారత జట్టుకు బిగ్ రిలీఫ్..జడేజా, బుమ్రా ఇద్దరూ రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ గడ్డపై రెండు సిరీస్ లు కోల్పోయిన భారత జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. భారత జట్టులోకి రవీంద్ర జడేజా, బుమ్రా ఇద్దరు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్ని రోజులుగా గాయాల కారణంగా టెస్టులకు బుమ్రా దూరమయ్యాడు. అవకాశాలు దక్కక జడేజా 9 నెలలుగా భారత జట్టుకు దూరం అయ్యాడు. అయితే తాజాగా ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆగస్టు 15వ తేదీ నుంచి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రా, రవీంద్ర జడేజాలను ఈ టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే టెస్ట్ జట్టును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 2025 నవంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సందర్భంగా ఈ ఇద్దరు చివరి మ్యాచ్ ఆడారు.






