Adipurush OTT Release Date: ‘ఆదిపురుష్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Disha Web Desk 7 |
Adipurush OTT Release Date:  ‘ఆదిపురుష్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెక్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై 12 రోజులు అవుతున్నప్పటికీ వివాదాలు వస్తూనే ఉన్నాయి. అయితే.. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టినట్లు మూవీ యూనిట్ ఓ నోట్ రిలీజ్ చేశారు. మొదటి మూడు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లు రాబట్టిన ఆదిపురుష్.. ఆ తర్వాత కాస్త స్లో అయింది. కానీ.. ఓవరల్‌గా ఈ సినిమా రూ.450 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా.. సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో చూసేందుకు ఎవరు ఇన్‌ట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఓటీటీలోకి వస్తే అప్పుడు చూద్దాం అన్నట్లు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. వైరల్ అవుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆగస్టు 11 లేదా 15న ఉండొచ్చని తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో ఒక రోజు ఓటీటీ స్ట్రీమింగ్ మొదలెట్టే అవకాశం ఉందంటున్నారు. ఆగస్టు 11న భోళాశంకర్, హిందీలో యానిమల్ చిత్రాలు రిలీజ్ ఉండటంతో ఆగస్టు 15 న ఓటీటీ స్ట్రీమింగ్ చేయవచ్చని చెప్తున్నారు. కాగా.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు సొంతం చేసుకుంది.

Read More..

ప్రధాని మోడీపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్

ప్రభాస్ కోసం నా భర్తను కూడా లెక్క చెయ్యను.. స్టార్ హీరోయిన్ Rambha

Next Story

Most Viewed