సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. వేషాలు దొబ్బకండి అంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-11 04:22:32  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. వేషాలు దొబ్బకండి అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు డిసెంబర్ 1న కోయంబత్తూరులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. సమంత, రాజ్‌‌లకు ఇది రెండో పెళ్లి కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త జంటకు కొందరు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా..మరికొందరు మాత్రం విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ నటి మాధవీలత(Madhavilatha) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకేంటో బాధ. ఆమె ఎవరిదో సంసారం కూల్చింది? అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్న మీరే ముందుగా ఎన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో అనే విషయాన్ని ప్రశ్నించుకోండి. మరొకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు విడాకులు ఇవ్వకుండా వేరే వారిని పెళ్లి చేసుకోకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇక్కడ అందరూ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. పెళ్లిళ్లు స్వర్గంలోన నిర్ణయించబడతాయి.

ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే.. అప్పటి వరకు కలిసి ఉంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. అంతేకానీ ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? మీరేమి పత్తిత్తులు కాదు కదా. ఇలా కామెంట్లు చేసే వారి గురించి నాకు బాగా తెలుసు. ఏడ్చే సమాజం ఎలాగూ ఏడుస్తది. పెళ్లి చేసుకుంటే విష్ చేసే రోజులు పోయి పడి ఏడ్చే రోజులు వచ్చాయి. మీరు ఎదో సతి సావిత్రి.. మహా పురుషులు రాముడు అయినట్లు వేషాలు దొబ్బకండి’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

చై కాదు చైతు.. ఆ హీరోకు స్ట్రాంగ్‌గా చెప్పిపడేసిన అక్కినేని కోడలు.. వీడియో వైరల్

పెళ్లి తర్వాత ఆ ఫొటో షేర్ చేసిన సమంత వదిన.. ఇలానే హ్యాపీగా చూసుకోండి ప్లీజ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్

Next Story