- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చై కాదు చైతు.. ఆ హీరోకు స్ట్రాంగ్‌గా చెప్పిపడేసిన అక్కినేని కోడలు.. వీడియో వైరల్
యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాల(Dhulipala)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాల(Dhulipala)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అంతేకాకుండా వేకేషన్స్‌కు వెళుతున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ అభిమానులకు కూడా దగ్గరవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పెళ్లి తర్వాత నాగ చైతన్య ‘తండేల్’(Thandel) మూవీలో మనముందుకు వచ్చి మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రజెంట్ ‘వృష కర్మ’(Vrushakarma) అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో చైతన్య శోభితలు పాల్గొన్నారు. అయితే అక్కడ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) కూడా ఉన్నాడు. ఇక మైక్ పట్టుకొని నవీన్ పొలిశెట్టి చై చై ఇటు రా నువ్వే మెయిన్ అని అన్నాడు. అప్పుడు శోభిత చై కాదు చైతు అని కొంచెం సీరియస్‌గా అంటుంది.
అప్పుడు నవీన్ పొలిశెట్టి అతని పేరులోనే చేస్తాను అని ఉంది చేయను అని అనకూడదు అని అంటాడు. ఇంతటితో ఈవీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సమంత నాగ చైతన్యను చై అని పిలుస్తుంది కాబట్టి శోభితకు మండినట్టుంది అని, అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంది కదా మళ్ళీ ఇదేంటి అని కొంతమంది అంటుంటే మరికొంతమంది శోభితకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
అబ్బా ఆ వాయిస్ ఏంట్రా అంత బాగుంది.. తన పాటలతోనే సామ్‌ను పడేశాడా.. రాజ్ నిడిమోరు వీడియో వైరల్






