- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం రిజర్వాయర్ సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వెంటనే నీరు తరలించాలని డిమాండ్ చేశారు.

దిశ, ధర్మారం: ధర్మారం మండలంలోని నంది మేడారం రిజర్వాయర్‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సందర్శించి రిజర్వాయర్‌లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం తీవ్రంగా తగ్గిపోవడంతో కార్యకర్తలతో కలిసి రిజర్వాయర్‌లోకి దిగి క్రికెట్, కబడ్డీ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రిజర్వాయర్ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, వరుణ యాగాలు, హోమాలు చేస్తే రైతులకు సాగునీరు రాదని స్పష్టం చేశారు. దేవుడిని మొక్కడం తప్పు కాదని, అయితే హోమాలు చేస్తే పుణ్యం వస్తుందేమో గానీ నీరు మాత్రం రాదంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. హోమాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం మానేసి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నంది రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ నాయకుడు ముత్యాల బలరాం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






