అబ్బా ఆ వాయిస్ ఏంట్రా అంత బాగుంది.. తన పాటలతోనే సామ్‌ను పడేశాడా.. రాజ్ నిడిమోరు వీడియో వైరల్

by I. Sairam |   (  Updated:2025-12-11 04:18:40  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నాగ చైతన్య‌(Naga Chaitanya)తో విడాకుల తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ చేస్తుందని చాలా వార్తలు వినిపించాయి.

అబ్బా ఆ వాయిస్ ఏంట్రా అంత బాగుంది.. తన పాటలతోనే సామ్‌ను పడేశాడా.. రాజ్ నిడిమోరు వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నాగ చైతన్య‌(Naga Chaitanya)తో విడాకుల తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ చేస్తుందని చాలా వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై ఈ జంట స్పందించలేదు. కానీ ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ రాజ్-సామ్ ఇటీవలే కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌(Isha Foundation)లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో తెలుపుతూ మ్యారేజ్ ఫొటోస్ షేర్ చేయడంతో ఈ విషయం కాస్త అందరికీ తెలిసింది.

అయితే వీరి వివాహ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రెజెంట్ సామ్ ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. రాజ్ మాత్రం కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. చాలా మందికి రాజ్ నిడిమోరు డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం సింగర్ అని అనక మానరు. వైరల్ అవుతున్న వీడియోలో రాజ్ నిడిమోరు మహాగణపతి పాటను ఎంతో సూపర్‌గా పాడారు.

తన వాయిస్‌తో ఆ సాంగ్ వింటుంటే అలానే వినాలినిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు అబ్బా ఆ వాయిస్ ఏంట్రా అంత బాగుంది.. తన పాటలతోనే సామ్‌ను పడేశాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. వేషాలు దొబ్బకండి అంటూ పోస్ట్

పెళ్లి తర్వాత ఆ ఫొటో షేర్ చేసిన సమంత వదిన.. ఇలానే హ్యాపీగా చూసుకోండి ప్లీజ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్


Next Story