- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి తర్వాత ఆ ఫొటో షేర్ చేసిన సమంత వదిన.. ఇలానే హ్యాపీగా చూసుకోండి ప్లీజ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ఇటీవలే పెళ్లిపీటలెక్కన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ఇటీవలే పెళ్లిపీటలెక్కన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుక తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్ లో బిజీ అయిపోయారు సమంత, రాజ్. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రాజ్ విషయానికి వస్తే.. ఇటీవల అతను తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’(The Family Man-3) వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో దూసుకెళ్లిపోతోంది. ఇటీవలే ముంబయిలో ఈ సిరీస్ సక్సెస్ పార్టీ కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. సమంత- రాజ్ పెళ్లి తర్వాత కొన్ని రోజులకే వారి మెహందీ ఫంక్షన్ నుండి ఒక అందమైన ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోను సమంత వదిన శీతల్ నిడిమోరు(Seetal Nidimoru) షేర్ చేస్తూ "ప్రేమను పంచుకుంటే ప్రేమ గుణించబడుతుంది." అనే క్యాప్షన్ జోడించింది. అయితే ఈ ఫొటోలో రాజ్ అండ్ సామ్ చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ రాజ్ ఫ్యామిలీతో సామ్ ఎంత హ్యాపీగా ఉందో, తనని ఇలానే హ్యాపీగా చూసుకోండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
అబ్బా ఆ వాయిస్ ఏంట్రా అంత బాగుంది.. తన పాటలతోనే సామ్‌ను పడేశాడా.. రాజ్ నిడిమోరు వీడియో వైరల్
సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. వేషాలు దొబ్బకండి అంటూ పోస్ట్






