రతిక లాంటి అమ్మాయి భార్యగా రావాలి: టాలీవుడ్ హీరో ఏం రిప్లై ఇచ్చాడంటే?

by Anjali |
రతిక లాంటి అమ్మాయి భార్యగా రావాలి: టాలీవుడ్ హీరో ఏం రిప్లై ఇచ్చాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-7 లో కంటెస్టెంట్‌గా ఎంపికై.. నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది రతిక రోజ్. మొదట్లో మెరుగ్గా రాణిస్తుందనుకున్న ఈ బ్యూటీ హౌస్‌లో కారణం లేకుండా ఎదుటివారి మీద అరవడం.. ఆడియన్స్ ఊహించని రేంజ్‌లో బిహేవ్ చేయడంతో సడన్‌గా ఎలిమినేట్ అయ్యింది. ఇక జనాలు అయితే రతికపై విపరీతంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక గంట ఎపిసోడ్ చూసి మూమ్మాటికీ తనదే తప్పని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ ఇంతటితో ఆగకుండా హీరో కిరణ్ అబ్బవరం వరకు వెళ్లడం విశేషం. ఈ హీరో నటించిన ‘రూల్స్ రంజన్’ చిత్రం అక్టోబర్ 6 వ తారీకున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కిరణ్ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.

దొరికిందే ఛాన్స్ అని కొందరు సరదా ప్రశ్నలు వేయగా.. మరికొంతమంది సెటైర్లు కూడా వేశారు. అయితే ఓ నెటిజన్.. ‘అన్న మీరు రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో వివాహం జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్’’ అని చెప్పాడు. దీనికి హీరో స్పందించి.. ‘ఎందుకమ్మా నా మీద ఇంత పగ.. పెళ్లయితే చేసుకుందాం. కానీ ఎంలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం.. అని సమాధానం ఇచ్చాడు.

Read More: ఆ హీరోయిన్ కోసం అదేంటి? ఏదైనా చేస్తా: స్టార్ హీరో

Next Story

Most Viewed