- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా రీల్స్ ఆనందం వెనుక దాగున్న ప్రమాదం.. పిల్లల్లో తగ్గుతున్న జ్ఞాపకశక్తి!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గడపడంవల్ల పిల్లల్లో దృష్టి మార్చే స్వభావం పెరుగుతోందని, ఇది ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని తగ్గిస్తుందని అధ్యయనం పేర్కొన్నది

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు తరచుగా సోషల్ మీడియాలో నిమగ్నమై పోతున్నారా? రీల్స్ చూస్తూ ఆనందంగా గడిపేస్తున్నారా? అబ్బో ఎంత హ్యాపీగా ఉంటున్నారోనని మురిసిపోకండి! ఎందుకంటే ఇది వారి జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఒక గంటసేపు సామాజిక మాధ్యమాల్లో గడిపిన పిల్లలను పరిశీలించగా, వారు రీడింగ్ అండ్ మెమోరీ టెస్టులలో మిగతా వారికంటే తక్కువ స్కోరు సాధిస్తున్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల మెదడు అభివృద్ధి, డిజిటల్ అలవాట్ల మధ్య సంబంధాన్ని పరిశీలించేందుకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనం నిర్వహించింది. ప్రధానంగా 9 నుంచి 13 ఏండ్ల వయసుగల పిల్లలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పరిశోధకులు కనీసం ఒక గంటసేపు సోషల్ మీడియాలో గడిపే పిల్లలు, అలాగే అసలు సోషల్ మీడియా జోలికి పోని పిల్లలు వివిధ అంశాల్లో ఎటువంటి ప్రతిభను కనబరుస్తున్నారో విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు గుర్తించింది ఏమిటంటే.. సోషల్ మీడియాలో గడిపే పిల్లలు రీడింగ్, అలాగే మెమోరీ టెస్టులలో మిగతా వారికంటే 1 నుంచి 2 పాయింట్లు తక్కువ స్కోరు సాధిస్తున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గడపడంవల్ల పిల్లల్లో దృష్టి మార్చే స్వభావం పెరుగుతోందని, ఇది లోతైన ఏకాగ్రత(Deep concentration)ను భంగపరుస్తుందని, జ్ఞాపక శక్తి తగ్గుదలకు దారితీస్తున్నదని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా 9 నుంచి 13 ఏండ్ల వయసులో పిల్లల మెదడు శిక్షణ, అలాగే అభ్యాసం(Training and practice) కోసం కీలకమైన దశ. ఈ సందర్భంలో డిజిటల్ అలవాట్లు, సోషల్ మీడియాలోని రకరకాల కంటెంట్ వారిని కన్‌ఫ్యూజ్ చేస్తూ, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్నదని అధ్యయనంలో తేలినట్లు రీసెర్చర్స్ అంటున్నారు. ఇది చిన్నపాటి ప్రభావమే అయినప్పటికీ, చదువుకునే పిల్లల్లో దీర్ఘకాలంపాటు సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా స్క్రీన్ టైమ్ ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని దెబ్బతీయడమే కాకుండా, మానసిక రుగ్మతలకు సైతం దారితీసే అవకాశం ఉందటున్నారు నిపుణులు. అందుకే తల్లిదండ్రులు, విద్యావేత్తలు పిల్లల్లో సోషల్ మీడియా ఉపయోగాన్ని నియంత్రించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read More..
Diwali festival: దీపావళి రోజున ఇలా చేయకండి.. పొరపాటున చేసిన మీ ఇంట్లో జరిగేది ఇదే!?






