- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Diwali festival: దీపావళి రోజున ఇలా చేయకండి.. పొరపాటున చేసిన మీ ఇంట్లో జరిగేది ఇదే!?
మహిళలందరూ ఎదురు చూస్తున్న దీపావళి పండుగ(Diwali festival) మరో రెండు రోజుల్లో రానుంది.

దిశ,వెబ్‌డెస్క్: మహిళలందరూ ఎదురు చూస్తున్న దీపావళి పండుగ(Diwali festival) మరో రెండు రోజుల్లో రానుంది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా లక్ష్మి పూజ చేసి, టపాసులు కాల్చి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇల్లు కాంతులతో వెలుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో టపాసుల మోతలు మొదలయ్యాయి. ఇక దీపావళి వచ్చిందంటే చాలు దీపాల వెలుగుల్లో , టపాసుల మోతలతో సందడి వాతావరణం నెలకొంటుంది.
అయితే, సంబరంగా జరుపుకునే ఈ దీపావళి రోజున అందరూ ఎంతో జాగ్రత్తగా టపాసులు కాల్చాలి. అలాగే, పెద్దవారు చిన్న పిల్లలకు టపాసులు ఇచ్చే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇదిలా ఉంటే.. పండగ నేపథ్యంలో మహిళలు లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే దీపావళి రోజున కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. పొరపాటున ఆ పనులు చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి..
దీపావళి రోజున ఇలా చేస్తే..
*దీపావళి (Diwali) పండుగ రోజు ఇంట్లో చీకటి ఉండకుండా దీపాలతో వెలిగించాలి. చీకటి ఉంటే ఇంటి ఆనందం తగ్గిపోతుందని విశ్వసిస్తారు. కాబట్టి సూర్యాస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకోని చీకటి పడే తరుణంలో దీపాల కాంతులతో ఇంట్లో వెలుగులు ఉంచడం చాలా మంచిది.
*పండుగ సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. గులాబీ, ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అని నమ్ముతారు.
*దీపావళి రోజున అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం అస్సలే మంచిది కాదు. ఎందుకంటే ఇది అనేక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు.
*ఇంట్లో బూజు దులపడం, ఊడ్చడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందని నమ్ముతారు. అందువల్ల, పండుగకు ముందు రోజుల్లోనే ఇంటిని చుట్టూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ఇక దీపావళి సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచాలి.
*పండుగ రోజు ఇంట్లో మాంసం వండటం అస్సలే మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇది దేవతలకు అసంతృప్తి కలిగిస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు.
*దీపావళి రోజు తులసిని తాకడం లేదా ఆకులను తీయడం వంటివి చేయకూడందట. ఇలా చేస్తే పేదరికం పెరిగే అవకాశం ఉన్నదని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక, పూజ సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి గొడవలకు వెళ్లొద్దు. దీని వల్ల ఇంట్లో ఎప్పుడు శాంతి వాతావరణ ఉంటుంది.
Read More..
దీపావళి.. శబ్దం, కాలుష్యం నుంచి చిన్నారులను ఎలా రక్షించాలి?
సోషల్ మీడియా రీల్స్ ఆనందం వెనుక దాగున్న ప్రమాదం.. పిల్లల్లో తగ్గుతున్న జ్ఞాపకశక్తి!






