- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపావళి.. శబ్దం, కాలుష్యం నుంచి చిన్నారులను ఎలా రక్షించాలి?
దీపావళి పండుగ మన జీవితంలోకి మరింత వెలుగును, ఆనందాన్ని తెస్తుంది. సంబురాలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పండుగ మరింత ప్రత్యేకంగా మారుతుంది. కానీ వారి సంరక్షణ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలి.

దిశ, వెబ్ డెస్క్ : దీపావళి పండుగ మన జీవితంలోకి మరింత వెలుగును, ఆనందాన్ని తెస్తుంది. సంబురాలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పండుగ మరింత ప్రత్యేకంగా మారుతుంది. కానీ వారి సంరక్షణ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలి. పటాకలు కాల్చడం వల్ల వచ్చే శబ్దం, పొగ కారణంగా ఏర్పడే కాలుష్యం పిల్లలకు ఇబ్బంది కలిగిస్తుంది. చర్మం, ఊపిరితిత్తులు, చెవులు సున్నితంగా ఉండటం వలన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి పిల్లలను సంరక్షించడం తల్లిదండ్రుల బాధ్యత. కాగా ఇందుకు కొన్ని సూచనలు అందిస్తున్నారు నిపుణులు.
* పండుగ సందర్భంగా వచ్చే విపరీతమైన శబ్దాల నుంచి దూరంగా ఉంచేందుకు వారిని ఇంటి లోపలి గదిలో ఉంచండి. కిటికీలు, తలుపులు మూసి.. శబ్దం, పొగ లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయండి.
* దీపావళి వేడుకల్లో పిల్లలను నిమగ్నం చేస్తూనే.. బాణసంచా, మెరుపులకు దూరంగా ఉండేలా చూసుకోండి. కారణం పొగ బిడ్డకు హాని కలిగిస్తుంది. బాణసంచా పిల్లల చెవులను ప్రభావితం చేస్తుంది. భయపెడుతుంది.
* క్రాకర్స్ సౌండ్స్ నుంచి సేఫ్‌గా ఉంచేందుకు బేబీ సేఫ్ ఇయర్ మఫ్స్, స్మూత్‌గా ఉండే కాటన్ బంతులను యూజ్ చేయొచ్చు. లేదంటే నిద్రపోయే సమయంలో బాణసంచా కాల్పులకు దూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
* దీపావళి సందర్భంగా ఇంటిని అలంకరించడం జరుగుతుంది. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కెమికల్ కొవ్వొత్తులను వాడకూడదు. లైట్స్, ఫ్లవర్స్‌తో అంలకరణ చేస్తే మంచిది.
* దీపావళి రోజున ఇంటికి వచ్చే అతిథులు.. చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవాలని కోరుకుంటారు. కానీ వారిని అలాంటి వాటికి దూరంగా ఉంచండి. కారణం శబ్దం పిల్లలను భయపెడుతుంది. చిరాకు పుట్టిస్తుంది.






