మీ ఇల్లు గుడికి దగ్గరగా ఉందా..? అయితే ఈ సమస్యలు తప్పవు..

by srinivas |
మీ ఇల్లు గుడికి దగ్గరగా ఉందా..? అయితే ఈ సమస్యలు తప్పవు..
X

దిశ, ఫీచర్స్: మనకు తెలిసినంత వరకు దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే ఎలాంటి దుష్టశక్తులు దరికి రావు అని భ్రమపడుతుంటాం. రోజు లేవగానే గుడి చూసినట్లు ఉంటుందని

సంతోషపడిపోతాం. కానీ ఆలయం సమీపంలో ఇల్లు ఉండకూడదు అని చెప్తున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఆలయానికి దగ్గరగా ఇల్లు ఎందుకు ఉండకూడదు? ఉంటే ఎటువైపు ఉండాలి? లాంటి విషయాల గురించి తెలుసుకుందాం.

*ఆలయం దగ్గర ఇల్లు ఉంటే వాస్తు నియమాలు పాటించాలి. ముందుగా పండితుడికి చూపించిన తర్వాతే ఇంట్లోకి వెళ్లాలి.

*శివాలయానికి దగ్గర ఇల్లు ఉంటే మన:శాంతి కరువవుతుంది. శత్రు భయం పెరిగిపోతుంది.

*విష్ణుమూర్తి ఆలయానికి దగ్గర ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు. ఎంత సంపాదించినా ఖర్చు అవుతూనే ఉంటుంది.

*అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు. ఏ కార్యక్రమంలోనూ శుభం జరగదు. అనుకున్న పనులు ఆగిపోవడం లేదంటే ఆలస్యంగా జరగడం చూస్తుంటాం.

*విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఇంటికి ఉత్తర, వాయువ్యం వైపు ఉంటే వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

> ఏ ఆలయం నీడ ఇంటిపై పడిన సుఖసంతోషాలు, మనశ్శాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు. నిత్యం ఏదో విషయంపై తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి.

ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఉండే ఇళ్లు.. ఆలయానికి కనీసం 100 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో విగ్రహం నుంచి లెక్కలోకి తీసుకోవాలి. దాన్నిబట్టి 100 నుంచి 200 అడుగుల దూరంలో ఇళ్లు ఉండేలా చూసుకోవాలి. ధ్వజస్తంభం నీడ కూడా ఇంటిపై పడకూడదు. అందుకే గతంలో దేవాలయాలు పర్వతాలు, నదీతీరంలో మాత్రమే ఉండేవి.

ఫ్లైట్‌లో సిగ‌రేట్ తాగిన సెల‌బ్రిటీ.. ఆ త‌ర్వాత‌..?! (వీడియో)



Next Story

Most Viewed