రేపే IPL ఫైనల్ మ్యాచ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం

by Satheesh |
రేపే IPL ఫైనల్ మ్యాచ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. శుక్రవారంతో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచులు ముగియగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కీలకమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉండేందుకు ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఇవాళ (శనివారం) ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసింది.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంఛైజ్ వెల్లడించింది. శుక్రవారమే రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడటం, ఫైనల్ మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియంలో ఉక్కుపోత, వేడి ఎక్కువ ఉండటంతో ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చినట్లు మేనేజ్మెంట్ తెలిపింది. కాగా, ఈ సీజన్‌లో సంచలన విజయాలు నమోదు చేసిన ఎస్ఆర్‌హెచ్.. శుక్రవారం జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచులో రాజస్థాన్‌పై గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఫైనల్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది.

Next Story

Most Viewed