- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో నేడు IPL మ్యాచ్.. SRH vs LSG
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో తలపడనుంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ ప్రియులకు పండగ లాంటి వార్త. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో తలపడనుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి, మరోసారి సిక్సర్ల వర్షం కురిసి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సొంత గడ్డపై ఆడుతుండటం ఆరెంజ్ ఆర్మీకి అతిపెద్ద సానుకూలాంశం. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆరంభం నుండే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఫామ్‌లో ఉండటం జట్టుకు కొండంత అండ. పవర్ ప్లేలోనే గరిష్ట పరుగులు రాబట్టి లక్నోను ఒత్తిడిలోకి నెట్టాలని హైదరాబాద్ భావిస్తోంది.
రిషభ్ పంత్ సారథ్యంలో లక్నో జట్టు ఈ సీజన్ లో ఇంకా బోణి తెరవక పోవడంతో.. ఈరోజు విజయం సాధించి ఖాతా ఓపెన్ చేయాలని చూస్తోంది. ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ జైత్రయాత్ర కొనసాగిస్తుందా లేక పంత్ సేన షాక్ ఇస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఉప్పల్ స్టేడియం మళ్ళీ 'ఆరెంజ్' మయం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లేక లక్నో.. ఎవరు విజయం నమోదు చేస్తారో ఎదురు చూడాల్సిందే. మరోవైపు నేడు బెంగుళూరు చిన్నస్వామి వేదికగా.. RCB, CSK జట్ల మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది.






