- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: పీకల్లోతు కష్టాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆదిలోనే మూడు కీలక వికెట్లు
ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభం అంత సానుకూలంగా లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభం అంత సానుకూలంగా లేదు. లక్నో బౌలర్ మహమ్మద్ షమీ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు వరుసగా పెవీలియన్ బాట పట్టారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బౌలింగ్‌కు వచ్చిన మహమ్మద్ షమీ ఆరంభంలోనే హైదరాబాద్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (డకౌట్), ట్రావిస్ హెడ్ (7 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కీలక బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు నిలకడ కోసం పోరాడుతోంది. హోమ్ గ్రౌండ్‌లో సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్న హైదరాబాద్ జట్టు, ఈ పరిస్థితి నుంచి ఎలా కోలుకుంటుందో చూడాలి. షమీతో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా ఒక వికెట్ తీశారు.






