- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందంటే..
ఈ నెల 7వ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది. రాత్రి 9 గంటల 56 నిమిషాలకు

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 7వ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది. రాత్రి 9 గంటల 56 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై అర్థరాత్రి 1.26 నిమిషాల వరకూ గ్రహణం ఉంటుందని పండితులు చెప్తున్నారు. రాత్రి 11.42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలం. ఈ గ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడనుండగా.. దాని ప్రభావం.. మిథున, సింహ, కుంభ, మీన రాశులపై అధికంగా ఉంటుందని, వీరంతా జాగ్రత్తగా ఉండాలని, కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
మేషం, కర్కాటక, మకర రాశుల వారికి గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు ఉండనున్నాయని పండితులు తెలిపారు.
వృషభరాశి వారికి గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది.. ఇబ్బందేం లేదని పండితులు చెప్పారు.
మిథున రాశి వారిపై గ్రహణం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఇబ్బందులు, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా తలనొప్పులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
సింహరాశికి వారికి ఏడవ రాశిలో గ్రహణం ఏర్పడటంతో అనుకూలంగా లేదన్నారు.
కన్యా, తులా, వృశ్చిక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశివారికి శుభఫలితాలు ఉంటాయన్నారు.
కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుండటంతో ప్రభావం తీవ్రంగా ఉంటుందని పండితులు తెలిపారు. జీవితంలో ఉద్యోగ సమస్యలు, చికాకులు, గొడవలు అధికంగా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.
మీన రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గమనిక : దిశ దీనిని ధృవీకరించదు. పండుతులు తెలిపిన సమాచారం ఆధారంగానే చంద్రగ్రహణ రాశిఫలాలను గురించి చెప్పాము.
Read More..
ఆ రోజున కొండగట్టు ఆలయం మూసివేత
చంద్రగ్రహణం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి?






