- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రగ్రహణం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి?
సెప్టెంబర్ 7 ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 7 ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. చంద్రగ్రహణం కారణంగా ఆరోజు సూతక కాలం నుంచి దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు మూతపడనున్నాయి. గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు నుంచే సూతక కాలం ప్రారంభమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 12.57 గంటల నుంచి సూతక సమయం మొదలుకానుంది. కాగా.. చంద్రగ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలని, చేయకూడని పనులు చేయడం వల్ల మంచి జరగదని పండితులు తెలిపారు.
సనాతన ధర్మాన్ని నమ్మేవారంతా సాయంత్రం 6 గంటలలోపే భోజనం చేయాలి. ఆ రాత్రి గ్రహణం పట్టి.. విడిచేంతవరకూ ఎలాంటి ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. అలాగే గ్రహణ కాలంలో నిద్రపోకూడదు. చంద్రగ్రహణం రాత్రి సమయంలో వస్తుండటంతో ధ్యానం, జపం, తపం వంటివి చేయడం మంచిది. కీలక నిర్ణయాలు, ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి.
గర్భిణులు ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టు, విడుపు స్నానం ఆచరించాలి. నిల్వ ఉండే, తినే ఆహార పదార్థాలపై దర్భలను ఉంచాలి.
గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం ఆచరించాలి. అర్థరాత్రి సమయంలో గ్రహం పూర్తవుతుండటంతో సోమవారం సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం ఆచరించాలి. సముద్ర స్నానం లేదా నదీస్నానం చేస్తే ఇంకా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ స్నానం అయ్యాకనే ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు.
గమనిక : పైన చెప్పిన విషయాలను దిశ ధృవీకరించదు. పండితులు తెలిపిన సమాచారం ఆధారంగానే ఈ వివరాలను అందించాము. ఈ విషయాలను విశ్వసించడం పూర్తిగా మీ వ్యక్తిగతం.
Read More..
ఈ నెల 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందంటే..






