- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మిథునరాశిలో గురుగ్రహ తిరోగమనం.. ఈ రాశులవారికి కష్టకాలం మొదలు
ఏ రాశి వారికైనా గురుబలం ఉంటే అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గురుగ్రహం తిరోగమనంలో ఉంటే అదే స్థాయిలో

దిశ, వెబ్‌డెస్క్: ఏ రాశి వారికైనా గురుబలం ఉంటే అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గురుగ్రహం తిరోగమనంలో ఉంటే అదే స్థాయిలో కష్టాలు కూడా తప్పవని చెప్తోంది. డిసెంబర్ 5.. అంటే నేటి నుంచి మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి (గురుడు) తిరోగమన కదలిక మొదలవుతోంది. ఇది అనేక రాశుల వారికి కష్టాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. కెరీర్, ఆర్థిక నిర్ణయాలు. సంబంధాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మేషరాశి
ఈ రాశిలో మూడవ ఇంట గురుగ్రహం తిరోగమనంలో ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ప్రయత్నాలు ఆలస్యం కావొచ్చు. ఉద్యోగానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగ మార్పు ప్రయోజనకరంగా ఉండే అవకాశం లేదు. అనవసర ప్రయాణాల వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయి. ఏ పనిలోనూ నిర్లక్ష్యం తగదు. నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి
వృషభ రాశి రెండవ ఇంట్లో గురుడు సంచరిస్తాడు. తిరోగమనం వల్ల ప్రతి పనిలోనూ ఒత్తిడి ఉంటుంది. అన్ని పనులను ఓపికగా తీసుకోవాలి. లేదంటే ఒత్తిడి పెరుగుతుంది. పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుది. ఖర్చులు పెరుగుతాయి. అహంకారం, గర్వాన్ని తగ్గించుకోవాలి. వీటివల్ల జీవిత భాగస్వామితో వాదనలు మరింత పెరిగే అవకాశం ఉంది.
తులారాశి
ఖగోళ గురువైన బృహస్పతి.. తులారాశిలో తొమ్మిదవ ఇంట తిరోగమనంలో ఉంటాడు. దీనివల్ల కెరీర్లో అభివృద్ధి ఆలస్యం కావొచ్చు. డబ్బు సంపాదించినా అదేస్థాయిలో ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో ఎనిమిదవ ఇంట బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు. ఆర్థిక నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా పెట్టుబడి, భాగస్వామ్యం లేదదా రుణంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇవి కెరీర్ పై ప్రభావం చూపవచ్చు. అహంభావం కొన్ని సంఘర్షణలకు దారితీయొచ్చు.
Read More..
ధనస్సు రాశిలో సూర్యుడు - కుజుడి సంయోగం.. ఈ రాశులవారికి శుభయోగం
శుక్ర మూఢం.. పెళ్లి ముహూర్తాలు మళ్లీ ప్రారంభమయ్యేది అప్పటి నుంచే..






