శుక్ర మూఢం.. పెళ్లి ముహూర్తాలు మళ్లీ ప్రారంభమయ్యేది అప్పటి నుంచే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-05 01:58:54  IST  )

నవంబర్ 26వ తేదీ నుంచి శుక్రమూఢం మొదలు కావడంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వేసవి ఎండల్లో పెళ్ళిళ్లంటే..

శుక్ర మూఢం.. పెళ్లి ముహూర్తాలు మళ్లీ ప్రారంభమయ్యేది అప్పటి నుంచే..
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 26వ తేదీ నుంచి శుక్రమూఢం మొదలు కావడంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వేసవి ఎండల్లో పెళ్ళిళ్లంటే.. ఉక్కపోతే. అందుకే నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ ఫిబ్రవరి 17వ తేదీ వరకూ ముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్సన్నీ వెలవెలబోతున్నాయి. అయితే ఈ మూఢం పెళ్లిళ్లకే గానీ హోమాలు, అన్నప్రాసనలు వంటి వాటికి ఉండదని, ఈ మూడునెలల కాలంలో అలాంటి వాటిని నిస్సందేహంగా చేసుకోవచ్చని పండితులు చెప్తున్నాయి. అయితే.. మూఢం అయిన వెంటనే ముహూర్తాలు ఉన్నాయా? అంటే ఉన్నాయి. కానీ..ఫిబ్రవరిలో 6, మార్చి నెలలో 8 రోజులు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 17 తర్వాతనే వివాహాది శుభకార్యాల నిర్వహణకు అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26.. మొత్తం 6 రోజులపాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే మార్చిలో 8, ఏప్రిల్ నెలలో 8 రోజుల చొప్పున ముహూర్తాలు ఉన్నాయి. మూఢం తర్వాత కూడా ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఇప్పటి నుంచే ఫంక్షన్ హాల్స్, పెళ్లి మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు బుక్కవుతున్నాయి.

Read More..

నేడు మిథునరాశిలో గురుగ్రహ తిరోగమనం.. ఈ రాశులవారికి కష్టకాలం మొదలు

ధనస్సు రాశిలో సూర్యుడు - కుజుడి సంయోగం.. ఈ రాశులవారికి శుభయోగం

Next Story