- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులపై టియర్ గ్యాస్ వేస్తారా యూజ్ లెస్ ఫెలోస్.. రేణుకా చౌదరి తిట్లకు జారుకున్న ధర్మేంద్ర ప్రధాన్!
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పక్కనుండగానే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై దాడిని ఖండిస్తూ మండిపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‍తో సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో యువత చేపట్టిన ఆందోళనపై పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ పార్లమెంట్ ఎగ్జిట్ గేట్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పక్కన ఉండగానే ఆమె ఘాటు వ్యాఖ్యలతో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదేం పిరికిపందల ప్రభుత్వం.. రైతులపై వాటర్ కెనాన్, విద్యార్థులపై బాష్పవాయు ప్రయోగిస్తారా? యూజ్ లెస్ ఫెలోస్ అంటూ మండిపడ్డారు. రేణుకా చౌదరి మాటలకు ధర్మేంద్ర ప్రదాన్ అక్కడి నుంచి వెళ్లిపోరు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Next Story






