ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ఆగస్టు 19న భారత్-పాక్ మ్యాచ్

by velandi.Saikiran |

హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఆగస్టు 19న భారత్-పాక్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ఆగస్టు 19న భారత్-పాక్ మ్యాచ్
X

దిశ‌, వెబ్ డెస్క్: పురుషుల హాకీ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే జరగనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హాకీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత హాకీ జట్టు తలపడనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 20 మందితో కూడిన భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించేసింది.

స్టార్ డ్రాగ్ ఫ్లిక్కర్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొంటుంది. ఈ వరల్డ్ కప్ లో భాగంగా పూల్ Dలో భారత జట్టు స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీన భారత్, వేల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆగస్టు 17న ఇంగ్లాండ్ తో తలబడనుంది. ఇక ఆగస్టు 19వ తేదీన హై వోల్టేజ్ మ్యాచ్ పాకిస్తాన్ తో ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

Next Story