ధనస్సు రాశిలో సూర్యుడు - కుజుడి సంయోగం.. ఈ రాశులవారికి శుభయోగం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-05 01:56:30  IST  )

సూర్య మంగళ యోగం.. సూర్యుడు - కుజుడు ఒక రాశిలో కలిసి ఉండటాన్ని ఇలా పిలుస్తారు.

ధనస్సు రాశిలో సూర్యుడు - కుజుడి సంయోగం.. ఈ రాశులవారికి శుభయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్య మంగళ యోగం.. సూర్యుడు - కుజుడు ఒక రాశిలో కలిసి ఉండటాన్ని ఇలా పిలుస్తారు. డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు ధనస్సు రాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండనున్నాయి. సూర్యుడిని ఆత్మ విశ్వాసం, నాయకత్వం, ప్రతిష్టకు చిహ్నంగా చూస్తారు. అలాగే కుజుడిని అభిరుచి, ధైర్యం, పోరాట బలాన్ని అందిస్తాడని నమ్ముతారు. ఈ రెండు అగ్ని - మూలక గ్రహాలు ధనస్సు రాశిలో కలసి ఉండటం వల్ల పరిస్థితుల్లో వేగవంతమైన మార్పులు, ప్రధాన నిర్ణయాలు, అదృష్టానికి సంబంధించిన విషయాలు అనివార్యమవుతాయి. ఈ సంయోగం కొన్ని రాశుల వారి ఆర్థిక స్థితి, కెరీర్, సంబంధాలను ప్రభావితం చేస్తుందని పండితులు చెప్తున్నారు.

సింహరాశి

సూర్యడు, కుజుడు కలయిక ఈ రాశిలో ఐదవ ఇంట్లో ఉంటుంది. ఫలితంగా పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభఫలితాలు ఉంటాయి. ఆర్థిక లాభాల రీత్యా కొత్త అవకాశాలు కలుగుతాయి. సామాజిక స్థితి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సకాలంలో సహాయం పొందుతారు. కానీ గుడ్డినమ్మకం మంచిది కాదు. పెట్టుబడులు లాభదాయకంగా ఉండవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది.

తులారాశి

తులారాశిలో మూడవ ఇంట్లో సూర్యుడు - కుజుడి కలయిక జరుగుతుంది. దీనివల్ల ఈ రాశిలో జన్మించిన వారిలో ధైర్యం, సామర్థ్యం పెరుగుతాయి. కొత్త కెరీర్ అవకాశాలు లభిస్తాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచన ప్రబలంగ ఉంటుంది. మీ మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీడియా, రచన, కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకరరాశిలో ఈ సంయోగం 12వ ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా ఈ రాశివారు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. విదేశీ యానం లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విషయాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత, ధ్యానం వైపు ఆకర్షణ పెరుగుతుంది. అనవసరమైన వాదనలకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం మంచిది

కుంభరాశి

కుంభరాశిలో సూర్య-కుజుల కలయిక 11వ ఇంట్లో జరుగుతుంది. దీని ఫలితంగా కుంభరాశి వారికి ఆదాయం పెరుగుదలతో పాటు.. కోరిన కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులు, ఇంటర్నెట్ ద్వారా ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. చదువు, కళలు, సృజనాత్మక కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. అహాన్ని నియంత్రించుకుని, అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలను పాటించడం ద్వారా గొప్ప విజయాలను అందుకుంటారు.

Read More..

నేడు మిథునరాశిలో గురుగ్రహ తిరోగమనం.. ఈ రాశులవారికి కష్టకాలం మొదలు

శుక్ర మూఢం.. పెళ్లి ముహూర్తాలు మళ్లీ ప్రారంభమయ్యేది అప్పటి నుంచే..

Next Story