మరో చాన్స్.. లాస్ట్ చాన్స్.. ఒక్క చాన్స్

by Disha edit |
మరో చాన్స్.. లాస్ట్ చాన్స్.. ఒక్క చాన్స్
X

పవన్ 'ఒక్క చాన్స్' అని అడిగే ముందు వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా? అనే విషయం తేల్చాలి. ఒకవేళ ఇతర పార్టీలతో కలిసి పొత్తుకు వెళితే పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటారా? అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా పవన్‌ను బీజేపీ ప్రకటించవచ్చు. కానీ, నాలుగు దశాబ్దాలుగా గ్రామగ్రామాన విస్తరించిన టీడీపీకి అధ్యక్షుడిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వెరసి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు పవన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకుంటారా? జగన్‌ను తిరిగి అధికారంలోకి రానీయకుండా ఉండేందుకు పవన్‌తో చేతులు కలిపినా, కొద్దికాలం ముఖ్యమంత్రిగా ఉండేందుకు పవన్ అభిమానులు, పవన్‌ను బలపరిచే నాయకరులు అంగీకరిస్తారా?

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉండగానే అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఎన్నికల సంగ్రామాన్ని తలదన్నే విధంగా ఉంది. ఇప్పటికే అధికారపక్షం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలలో 98 శాతం నెరవేర్చామని, హామీ ఇవ్వని అనేక పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామనీ, కనుక తమకు 'మరో చాన్స్'(one more chance) ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ys jagan)ప్రజలను కోరుతున్నారు.

తనకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి 'లాస్ట్ చాన్స్'(last chance) ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అభ్యర్థిస్తున్నారు. వైఎస్ఆర్‌ సీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది కనుక తనకు 'ఒక్క చాన్స్'(one chance) ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విన్నవిస్తున్నారు.

అదే ఆయనకు శరాఘాతం

వైఎస్ జగన్, చంద్రబాబు వినతుల మీద ఎలా స్పందించాలో ప్రజలకు తెలుసు. ఎందుకంటే, వారి పాలన ఎలా ఉంటుందో చూశారు కాబట్టి. కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(janasena cheif) వినతి 'ఒక్క చాన్స్' పైనే అనేక సందేహాలు ఉన్నాయి. దీనికి కారణం జనసేనాని(janasenani) తీసుకుంటున్న స్థిరత్వం లేని నిర్ణయాలు, పరిణితి లేని వ్యూహాలే. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే శక్తి లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో(ap politics) పవన్‌ కల్యాణ్ కేంద్ర బిందువుగా మారే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల భవిష్యత్తు రాజకీయంగా పవన్‌(pavan kalyan) తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాలు తేటతెల్లం చేస్తున్నాయి.పవన్ అధికార పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం అధికార పార్టీ 2024 ఎన్నికలలో ఇబ్బందులు ఎదుర్కోవడం తథ్యం. అదే జనసేనాని ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీతో కలిసి పోటీ చేసినా ముక్కోణపు పోటీ జరిగి ఓట్లు చీలి వైఎస్ఆర్‌ సీపీకే(ysrcp) అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే పవన్ తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు రారు? అంటూ ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. జనసేన సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. దీనిని జనసేనాని స్వయంకృతాపరాధంగానే భావించవచ్చు. పవన్ పార్టీ పెట్టిన నాటి నుంచి పరిపూర్ణ రాజకీయ నేతగా పరిణితి ప్రదర్శించి ఉంటే 2024 ఎన్నికలలో కచ్చితంగా ప్రత్యమ్నాయంగా కనిపించేవారు. 'జగన్‌ను ఎలా రాజకీయంగా దెబ్బతీయాలి' అనే విధంగానే జనసేన(janasena) రాజకీయాలు చేయడంతో చంద్రబాబుకు(chandrababu naidu లబ్ధి చేకూరింది. దీంతో చంద్రబాబు దత్తపుత్రుడిగా పవన్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇది పవన్ ఎదుగుదలకు శరాఘాతంగా మారింది.

వారు ఒప్పుకుంటారా?

పవన్ 'ఒక్క చాన్స్' అని అడిగే ముందు వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా? అనే విషయం తేల్చాలి. ఒకవేళ ఇతర పార్టీలతో కలిసి పొత్తుకు వెళితే పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటారా? అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా పవన్‌ను బీజేపీ ప్రకటించవచ్చు. కానీ, నాలుగు దశాబ్దాలుగా గ్రామగ్రామాన విస్తరించిన టీడీపీకి అధ్యక్షుడిగా(tdp), 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వెరసి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు (tdp chief) పవన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకుంటారా? జగన్‌ను తిరిగి అధికారంలోకి రానీయకుండా ఉండేందుకు పవన్‌తో చేతులు కలిపినా, కొద్దికాలం ముఖ్యమంత్రిగా ఉండేందుకు పవన్ అభిమానులు, పవన్‌ను బలపరిచే నాయకులు అంగీకరిస్తారా? అనేది ఆలోచించాలి.

2019 ఎన్నికలలో చంద్రబాబు పాలనపై పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. అలాంటిది ఇప్పుడు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళితే చంద్రబాబు ఎలా సచ్ఛీలుడయ్యారో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత జనసేనానిపై ఉంటుంది. ఇటువంటి సందేహాల మీద స్పష్టత ఇచ్చాక 'ఒక్క చాన్స్' అడిగితే పవన్ రాజకీయ పరిపక్వత ప్రజలకు తెలుస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరింప చేయవలసిన ఆవశ్యకత ఉందనే జనసేనాని గ్రహించాలి. బీజేపీ(bjp) లాంటి జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీకి రోడ్ మ్యాప్ ఇచ్చి ప్రోత్సహస్తుందనుకోవడం కచ్చితంగా భ్రమే కనుక, జనసేనాని ఇటువంటి విషయాలను గ్రహించి, ప్రజలకు సేవ చేయాలని తలంపునకు తగ్గట్టు ప్రణాళికాబద్ధంగా ప్రజామోదం పొందే రాజకీయాలు చేసినప్పుడే ఈ రాష్ట్రానికి, తద్వారా పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది.


కైలసాని శివప్రసాద్

జర్నలిస్ట్, కాలమిస్ట్

హైదరాబాద్, 94402 03999


Next Story